Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం: భార్యను హత్య చేయబోయి భర్త హతమయ్యాడు

Advertiesment
Extramarital affair
, మంగళవారం, 8 మార్చి 2022 (11:05 IST)
భర్తకి తాగడమే పని. ఎప్పుడూ అదే ధ్యాస. సంసారం కూడా చేయకపోవడంతో ఆ భార్య విసిగిపోయింది. సొంత కొడుకు తల్లిదండ్రులు బుజ్జగించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భర్తతో విసిగిపోయిన ఆ భార్య బాబాయ్ తోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. చివరి ఏమైందంటే..?

 
వైరాలోని తల్లాడ మండలం కుర్నవల్లి కాలనీకి చెందిన జయరాజు, నిరోష దంపతులు. రెండు సంవత్సరాల క్రితమే వీరికి వివాహం జరిగింది. పెళ్ళి కాక ముందు నుంచీ జయరాజు తాగుడుకు బానిస. పెళ్ళవ్వడమే ఆలస్యం... శోభనం గదిలోను మద్యం తాగి పడుకున్నాడు. 

 
మూడురాత్రులు అలాగే చేశాడు. మూడు రాత్రులు కాదు..రెండు సంవత్సరాల పాటు సంసారం చేయకుండా తిరుగుతున్నాడట. దీంతో ఆమె విసిగిపోయింది. కొడుకును మార్చాలనుకున్నారు తల్లిదండ్రులు. అయితే అతను మారలేదు. ఇక వివాహిత పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది. విరహంతో ఉన్న ఆమె బాబాయ్ క్రిష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. క్రిష్ణతో కలిసి ఏకాంతంగా గడిపేది. 

 
క్రిష్ణ ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్ళేది. దీంతో విషయం జయరాజుకు తెలిసింది. భార్యను ఎలాగైనా రెడ్ హాండెండ్ గా పట్టుకోవాలనుకున్నాడు. ఎప్పటిలాగా తాగాడు. కానీ రాత్రికి ఇంటికి వెళ్ళకుండా నేరుగా క్రిష్ణ ఇంటికి వెళ్ళాడు. క్రిష్ణ ఇంటిలో నిరోష కనిపించింది. దీంతో ఆగ్రహంతో రోకలి బండతో ఆమెపై దాడి చేయబోయాడు. వెంటనే మేల్కొన్న క్రిష్ణ రోకలిని తన చేతిలోకి తీసుకుని జయరాజు తలపై గట్టిగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడే చనిపోయాడు జయరాజ్. 

 
నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం ఎంతమంది ఇంకెంతమంది  ప్రాణాలను బలితీసుకుంటుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఐదువేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు