Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్లిందని అలిగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (09:21 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందని అలిగిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భాగ్యనగరిలోని ఫిల్మ్ నగర్ పరిధిలోని దుర్గా భవాని నగర్‍‌లో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే ..
 
దుర్గా భవాని నగర్‌కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివానీ అనే యువతితో వివాహమైంది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో శివానీ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో పాటు కుటుంబీకులతో శివానీ మాట్లాడటం మానేసింది. 
 
దీంతో భర్త నరసింహ తీవ్ర మనస్తాపం చెందాడు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరసింహ... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నేడు తేలనున్న అవినాష్ రెడ్డి భవితవ్యం... 
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయి, ముందస్తు బెయిలుపై విడుదలైనవున్న కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారమ జరుపనుంది. 
 
ఈ కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం.సురేంద్రన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది. 
 
ఈ కేసులో సునీత స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై ఈ నెల 13వ తేదీన వాదించారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఈనెల 30 లోపు ముగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. అయితే, అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
జూన్ 9న నర్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అత్యవసర జాబితాలో చేర్చాలని కోర్టును అభ్యర్థించడంతో సునీత పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇపుడు ఈ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments