Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. భర్తను కడతేర్చిన భార్య

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (12:44 IST)
అక్రమం సంబంధాన్ని అడ్డుగావున్నాడనీ భావించిన ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ దారుణం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్‌ శేఖర్‌ (30)కు అదే ప్రాంతానికి చెందిన ముడావత్‌ జ్యోతి (26)కు పదేళ్ల క్రితం వివాహమైంది. 
 
ఈ దంపతులు మూడేళ్ల క్రితం గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాకు వలస వచ్చారు. శేఖర్‌ మేస్త్రీ పనిచేస్తుండగా జ్యోతి కూలి పనిచేస్తుండేది. ఈ క్రమంలో రామచంద్రాపురం ఉస్మాన్‌ నగర్‌కు దుడ్డెల మాణిక్యం(42) తెల్లాపూర్‌కు చెందిన రాజీవ్‌ రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
రాజీవ్‌ రెడ్డి ఇటీవల తెల్లాపూర్‌లో రెండు విల్లాలు కొనుగోలు చేశాడు. అందులో పనుల కోసం శేఖర్‌ దంపతులు వెళ్లడంతో మాణిక్యంకు వారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతను శేఖర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
శేఖర్‌ తరుచూ తనను కొడుతుండటంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన జ్యోతి ప్రియుడితో కలిసి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న సాయంత్రం 6 గంటలకు శేఖర్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు ఆహ్వానించాడు. 
 
పురుగు మందు కలిపిన మద్యాన్ని తాగించి గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నిందితుడితోపాటు మృతుడి భార్యను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments