Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:04 IST)
ఓ మహిళ వివాహమైన తర్వాత ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, తమమధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందని భావించి, ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. చివరకు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
షాద్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫరూక్ నగర్ మండలం చిన్న చిల్కమర్రికి చెందిన ఎరుకలి యాదయ్య (32)కు మౌనిక అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త మద్యానికి బానిసయ్యాడు. 
 
అదేసమయంలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్న అశోక్‌‍తో మౌనికకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకుదారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ ఏకాంతంగా కలుస్తూ వచ్చారు. ఈ విషయం భర్తకు తెలిస్తే అంగీకరించడని భావించి, అతని అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ ప్లాన్ వేశారు. తమ కుట్రలో భాగంగా, గత ఫిబ్రవరి నెల 18వ తేదీన యాదయ్యను కొత్తూరు మండలం గూడూరుకు తీసుకెళ్లి పీకల వరకు మద్యం తాగించి గొంతుకోసి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని ఓ గుంతలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. 
 
అయితే, పొలానికి వెళ్లిన తన భర్త ఇంటికి రాలేదని పేర్కొంటూ మరుసటి రోజున మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేసమయంలో మౌనిక గ్రామం వదిలి షాద్‌ నగర్‌లోని అయ్యప్ప కాలనీలో ఉండే అశోక్‌తో కలిసి ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో మౌనికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments