Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన 23 యేళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, నలుగురు యువకులు ఇంట్లో చొరబడి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ అవమానం భరించలేక ఆ యువతి తనను గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల పేర్లతో సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18వ తేదీన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం