ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసి వాగులో పడేసిన కిరాతక కుమారుడు

ఠాగూర్
శనివారం, 6 సెప్టెంబరు 2025 (09:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రిని ఓ కిరాతక కుమారుడు దారుణంగా హత్య చేసి, శవాన్ని వాగులో పడేశాడు. ఆస్తి పంపకంలో ఏర్పడిన వివాదం విషాదాంతంగా ముగిసింది. పోలీసుల కథనం మేరకు.. 
 
కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్‌కు చెందిన బాలయ్య (70) తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటుండగా, బీరయ్య అక్కడికి వెళ్లి తండ్రితో ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. వారి మధ్య వాగ్వివాదం ముదరడంతో బీరయ్య కర్రతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
 
తర్వాత, బాలయ్య మృతదేహాన్ని బీరయ్య కారు డిక్కీలో వేసుకొని చింతపల్లి బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లి వాగులో పడేశాడు. అయితే, బాలయ్య రాత్రివరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, బీరయ్యే తండ్రిని హత్య చేసినట్లుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. బీరయ్య తెలిపిన సమాచారంతో గజ ఈతగాళ్ల సహాయంతో బాలయ్య మృతదేహాన్ని డిండిచింతపల్లి బ్రిడ్జ్ వద్ద వాగు నుంచి వెలికితీయించారు. ఘటనపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments