Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (09:37 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ దారుణ వెలుగు చూసింది. తమను లైంగికంగా వేధిస్తున్న ఓ వృద్ధుడుని కొందరు మహిళలంతా కలిసి హత్య చేశారు. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో మొత్తం పది మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మృతుడుకి వయసు 60 యేళ్లుగా ఉంటాయని, ఆయనకు నాలుగేళ్ల క్రితమే భార్య చనిపోయిందని చెప్పారు. అప్పటి నుంచి గ్రామంలోని పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
 
నిందితుడి ఆగడాలు రోజురోజుకూ మితిమీరడంతో భరించలేని ఆరుగురు బాధితురాళ్లు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ రాత్రి వారంతా సమావేశమై అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. ఈ దారుణానికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా సహకరించినట్టు తేలింది. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, అక్కడ దహనం చేశారు.
 
కొన్ని రోజులుగా ఆ వ్యక్తి కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య విషయం బయటపడింది. ఈ హత్యలో పాలుపంచుకున్న ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు తమను నిరంతరం లైంగికంగా వేధించడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరుగురు మహిళలు పోలీసుల విచారణలో అంగీకరించారు.
 
అయితే, మృతుడి లైంగిక వేధింపుల గురించి గతంలో బాధితురాళ్ల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం