Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్ లైన్ అప్పుల బాధ: భార్యాపిల్లలకు విషమిచ్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (12:50 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగీరథ్‌పురాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.

 
వాస్తవానికి సాగర్‌లో నివాసముంటున్న అమిత్ యాదవ్ మంగళవారం ఉదయం నుంచి వెలుపలికి రాలేదు. కుటుంబ సభ్యుల అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. భగీరథపురాలో నివశిస్తున్న అతని అత్తమామలకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. లోపల అమిత్ యాదవ్ ఉరి వేసుకుని ఉన్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు, అతడి భార్య మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నారు.

 
డిసిపి ధర్మేంద్ర మాట్లాడుతూ.. అమిత్ ఓ ప్రైవేట్ టెలీకమ్యూనికేషన్ టవర్ కంపెనీలో టెక్నికల్, సెటప్ పనులు చేసేవాడు. అతని అత్తమామలు కూడా అతడికి సమీపంలో ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందురోజు అతడు ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని వచ్చాడు. కాగా సంఘటన స్థలం నుండి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అందులో తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రైవేట్ అప్పులు ఇచ్చే యాప్ లనీ, వారి బెదిరింపులతో ఏం చేయాలో తోచక ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇరుగుపొరుగు వారి ప్రకారం, అమిత్ ప్రవర్తన అందరితో చాలా బాగుండేదనీ, చుట్టుపక్కల ఎవరితోనూ వివాదం లేదని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments