Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన బంధువుకు పింఛన్ ఆపేసిన వలంటీరుపై కీచకరపర్వం... వైకాపా నేతల దాష్టీకం

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (09:10 IST)
చనిపోయిన ప్రభుత్వం నెల నెలా ఇచ్చే పింఛన్ ఆపేసిందనే కక్షతో ఓ మహిళా వాలంటీర్‌ను వైకాపా ఎంపీటీసీ, అతని అనుచరులు చెరబట్టారు. ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కదిరేపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చనిపోయిన బంధువుకు పింఛన్ ఆపేశాననే కక్షతో వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె కుటుంబసభ్యులు తనపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారంటూ వేద అనే మహిళా వాలంటీరు సోమవారం ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. తనకు, తన కుటుంబానికి మడకశిర వైకాపా ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎంపీటీసీ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులతో ప్రాణహాని ఉందని పేర్కొంది. 
 
పింఛను ఆపేశాననే కోపంతో ఎంపీటీసీ సభ్యురాలు నింగమ్మ భర్త బసవరాజు, మరికొంతమంది కలిసి మొదట తనతో గొడవపడ్డారని, తర్వాత తన సోదరుడిపై దాడి చేశారని.. ఈ విషయమై ప్రశ్నించడానికి వెళితే తన తమ్ముడిని, తల్లిని కొట్టి, తన దుస్తులు చింపి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. పైగా తమ మీదనే తప్పుడు కేసు పెట్టగా.. సోమవారం తమ కుటుంబ సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. 
 
దీనిపై ఎంపీటీసీ భర్త బసవరాజు మాట్లాడుతూ.. వాలంటీరు కుటుంబసభ్యులే తనపై దాడి చేశారని చెప్పారు. ఈ వివాదంపై ఎస్ఐ లావణ్యను వివరణ కోరగా, ఇటీవల ఓ వివాదానికి సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వాలంటీరు కుటుంబ సభ్యులు నలుగురిని అరెస్టు చేశామన్నారు. అలాగే ఎంపీటీసీ కుటుంబ సభ్యులు 16 మందిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments