Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఎస్ఐ - సహచరుల అత్యాచారం

Advertiesment
victim
, మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (19:42 IST)
హర్యానా రాష్ట్రంలోని పల్వాల్‌లో ఓ దారుణం జరిగింది. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ భార్యపై ఎస్ఐతో పాటు అతని సహచరులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను మరో వ్యక్తికి కూడా విక్రయంచారు. చివరకు అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జులై 23న హసన్పూర్ పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆమె ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించిన ఎస్ఐ శివ్ చరణ్.. తన సహచరుడు బాలితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లాలని బెదిరించాడు. అక్కడ అప్పటికే నిరంజన్, భీమా వేచి చూస్తున్నారు. అక్కడ వారంతా కలిసి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అత్యాచారం చేయడాన్ని వీడియో కూడా తీశారు. 
 
ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి పల్వాల్లో శాంతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడామెపై రాత్రంతా లైంగికంగా వేధించారు. అనంతరం బిజేంద్ర అనే వ్యక్తికి ఆమెను విక్రయించారు. అతడు తన బావమరిది గజేంద్రతో కలిసి ఎస్ఐ శివ్ చరణ్ సమక్షంలోనే అత్యాచారం చేశాడు.
 
అలా ఆ మహిళను నిందితులు ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడి ఫోన్‌ను దొరకబుచ్చుకుని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రక్షించిన పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐతో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీకి సిజేరియన్-కడుపులో డిన్నర్ ప్లేట్.. మరిచిపోయి కుట్లు వేశారు..