Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!

వరుణ్
గురువారం, 18 జులై 2024 (12:26 IST)
ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై పగ పెంచుకున్న కుమారుడు ఆయనను కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గతరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రఘునాథ రెడ్డి ఓ ప్రైవేటు కాలేజీలో లేక్చరర్‌గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రఘునాథ రెడ్డి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ దాదాపు రూ.16 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బులు కోసం వేధిస్తుండడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. దీంతో కొన్నేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నారు. 
 
గతరాత్రి ఈ విషయమై మధ్య మరోమారు గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు తండ్రి ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయిన రఘునాథ రెడ్డి వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. ఆపై బెంగుళూరులో ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విషయాన్ని బంధువులతో పాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాత్రంతా చిన్నరెడ్డప్మ కోసం గాలించారు. ఈ ఉదయం వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు రఘునాథ రెడ్డి హత్య కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments