Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

ఠాగూర్
మంగళవారం, 29 జులై 2025 (08:57 IST)
తన తమ్ముుడుకి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన అక్క... తన భర్త సాయంతో అతన్ని కడతేర్చింది. అంత్యక్రియల సమయంలో మృతదేహం మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తండ్రి... కుమార్తెను, అల్లుడుని నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్రదుర్గం జిల్లా హొళల్కెర పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున, నిశా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. నిశాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్‌తో వివాహం జరిపించారు. మల్లికార్జున బెంగుళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంజునాథ్ కారులో సొంతూరుకు వస్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలో భాగంగా వివిధ రకాలైన రక్త పరీక్షలు చేశారు. ఇందులో మల్లికార్జునకు నయం కాని అరుదైన వ్యాధి సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని వైద్యులు అక్క నిశాకు తెలిపారు. బాధితుడుకి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు వాహనంలో బయలుదేరారు. 
 
అయితే, మల్లికార్జున తనకు నయంకాని వ్యాధి సోకిదని, అప్పులు చేశానని, జీవించడానికి ఆసక్తి లేదని అక్కబావ వద్ద బోరున విలపిస్తూ చెప్పాడు. దీంతో తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలియకూడదని కూడదని, తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించిన నిశా.. తన భర్తతో కలిసి సోదరుడు మల్లికార్జున మెడకు టవల్ బిగించి హత్య చేశారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి, ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించారు. కానీ, అంత్యక్రియల సమయంలో మల్లికార్జున మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తండ్రి.. కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిశా, మంజునాథ్‍‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments