Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం... పోలీసుల అదుపులో నిందితులు

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (12:36 IST)
చిత్తూరు జిల్లా గాంధీ రోడ్డు, లక్ష్మీ సినిమా మహాల్ సమీపంలో కొందరు దుండగులు మంగళవారం అర్థరాత్రి సమయంలో కాల్పులకు తెగబడ్డారు. పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని నివాసంలోకి ప్రవేశించిన దుండగులు... వారిని బెదిరించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయితే, మాల్ యజమాని అప్రమత్తమై పోలీసులకు సకాలంలో సమాచారం చేరవేయడంతో పెను ముప్పు తప్పింది. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నలుగురు దండుగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, కత్తులతో పాటు పొగ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న దండగులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. మరో ఇద్దరు దుండగులు అక్కడే ఉన్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు పుష్పమాల్ ఇంటి యజమాని నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను గాలిస్తున్నారు. 
 
కాగా, ఎంతో ప్రశాంతంగా ఉండే చిత్తూరు జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా, ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments