ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయి అత్యాచారం, గర్భవతి అయిన బాలిక

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (19:46 IST)
తల్లిదండ్రులు చనిపోయారని బాబాయి వద్దకు వస్తే అతడు ఆ బాలిక పట్ల కామాంధుడయ్యాడు. అతడి కామానికి ఏడో తరగతి చదివే బాలిక గర్భవతైంది. ఈ దారుణ ఘటన విజయవాడ నగర శివారులోని పాయకాపురంలో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. దీనితో ఆ బాలికను తనే చూసుకుంటానని ఆమె బాబాయి తన ఇంటికి తీసుకుని వచ్చాడు. బాలిక అక్కడే వుండి చదువుకుంటోంది. కూతురుతో సమానమైన ఆ బాలిక పట్ల అతడు కామాంధుడుగా మారాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరుగుతున్న దారుణాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర అనారోగ్యంతో వున్న ఆ బాలికను పోలీసులు ఆసుపత్రికి పంపగా అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అయిందని తేల్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం