Webdunia - Bharat's app for daily news and videos

Install App

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (23:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో 17ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్‌ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటోంది. ఇటీవల ఆ బాలికకు సామాజిక మాధ్యమాల ద్వారా కునియముత్తూరుకు చెందిన కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ బాలికను మాయమాటలతో కునియముత్తూరులో ఉన్న తన గదికి రప్పించుకున్నాడు ఆ విద్యార్థి. అక్కడకు వచ్చిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించాడు. అంతేగాక ఆరుగురు సహచర విద్యార్థులను కూడా తన గదికి రప్పించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. బాలికను సోమవారం ఉదయం వారు ఆమె ఇంటివద్ద విడిచిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

SVK: కొరియా నటి నాయికగా మంగోలియన్ ఆర్టిస్ట్ విలన్ గా ఎస్వీ కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments