Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కాల్పులు.. ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (14:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రహీంపట్టణంలోని కర్ణంగూడ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు దండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెదారు. మరో వ్యక్తి రాఘవేంద్ర రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, ఇటీవల పది ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి అప్పటికే మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నట్టు సమాచారం. దీంతో భూమిని కొనుగోలు చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మట్టారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమినర్ మహేష్ భగవత్త పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments