Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం డబ్బు కోసం భార్యపై అత్యాచారం చేయించిన ఉన్మాది భర్త

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (10:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ కట్నపిశాచి అత్యంత హేయంగా ప్రవర్తించాడు. కట్నం డబ్బుల కోసం కట్టుకున్న భార్యను తన ఇద్దరు బంధువులతో అత్యాచారం చేయించాడు. ఈ పెళ్లి 2019లో జరిగింది. అప్పటినుంచి వరకట్న వేధింపులు జరుగుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‍‌లో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరత్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి అదే రాష్ట్రానికి చెందిన యువతితో వివాహమైంది. వివాహానికి ముందు కట్నకానులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, వివాహం తర్వాత అత్తింటివారు చెప్పిన కట్నం 1.50 లక్షల రూపాయల ఇవ్వలేక పోయారు. 
 
దీంతో తన బంధువులు ఇద్దరితో భార్యపై అత్యాచారం చేయించాడు. దాన్ని ఫోనులో వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి తద్వారా డబ్బులు సంపాదించుకుంటానని భార్యను బెదిరించాడు. దీంతో బాధితురాలు భర్తతో పాటు తనపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై పోలీస్ స్టషన్ హౌస్ ఆఫీసర్ దౌలత్ సాహు మాట్లాడుతూ, "ఒక మహిళ అత్యాచారం కేసు నమోదైంది. తన భర్త, ఇద్దరు బంధువులు కలిసి అత్యాచారం చేసినట్టు అందులో పేర్కొన్నారు. పోర్నోగ్రాఫిక్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణ. అయితే, దీన్ని ధృవీకరించాల్సివుంది" అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments