Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త-బిడ్డతో టైమ్ స్పెండ్ చేయట్లేదు.. మహిళా కానిస్టేబుల్‌ని కాల్చి చంపేశాడు..

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (12:23 IST)
మహిళా కానిస్టేబుల్ భర్త చేతిలో హతం అయ్యింది. ఉద్యోగం చేస్తున్న భార్య ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదనే కోపంతో.. తుపాకీతో ఆమె భర్త కాల్చి చంపేశాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాజధాని పట్నాలో జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌ కుర్తాలో కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో వివాహం అయ్యింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది.
 
శోభ ఇటీవలే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరింది. శోభా కుమారి విధి నిర్వహణలో అధిక సమయం గడపడం లేదని భర్త గజేంద్ర కుమార్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఉద్యోగం మానేయాలని ఆమెను వేధించేవాడు. అందుకు శోభా కుమారి నిరాకరించడంతో గజేంద్ర ఆమెపై కోపం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో గజేంద్ర స్థానికంగా ఓ హోటల్‌లో గది బుక్‌ చేసి భార్యను అక్కడకు రావాల్సిందిగా కోరాడు. ఉద్యోగం వదులుకోమన్న భర్తతో శోభా వాదించింది. కోపంతో ఊగిపోయిన గజేంద్ర తుపాకితో భార్యను కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
ఆపై పోలీసులు అతనిని అదుపులోకి విచారించగా.. ఉద్యోగం కారణంగా తనతో, తన నాలుగేళ్ల కుమార్తెతో సరిగ్గా సమయం గడపలేదనే కోపంతోనే భార్యను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. శోభాతో అతనికి ఇది రెండో పెళ్లి అని విచారణలో వెల్లడి అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments