Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం వాజేడు ఎస్‌ఐను కలిశాను.. అది ప్రేమగా మారింది.. ప్రియురాలు

రామన్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడేందుకు ముందు తన ప్రియురాలిని కలిశాడు. ఆ తర్వాత ఆమెను గది నుంచి బయటకు పంపించి రివాల్వర్‌‍తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
తాజాగా హరీశ్‌తో తనకున్న సంబంధంపై ఆమె వివరించారు. ఒ యేడాది క్రితం ఇన్‌స్టా ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని... కొన్ని రోజుల తర్వాత ఆయన ఎస్ఐ అని తెలిసిందని... దీంతో, గతంలో తనను కొందరు మోసం చేసిన విషయాన్ని, కేసు వివరాలను తెలిపి ఆయన సాయం కోరానని తెలిపింది. ఆ తర్వాత తమ పరిచయం ప్రేమకు దారి తీసిందని చెప్పింది.
 
హరీశే తొలుత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని... తనకు కొత్త జీవితాన్ని ఇస్తానని చెప్పారని సదరు యువతి తెలిపింది. మన పెళ్లి జరగాలంటే పోలీసు ఉన్నతాధికారుల ఎదుటైనా, పోలీస్ స్టేషన్ ముందైనా, తన ఇంటి వద్దనైనా ధర్నా చేయాలని కూడా సలహా ఇచ్చారని చెప్పింది. పైగా, ఆత్మహత్యకు ముందు రోజు తాము ప్రైవేట్ రిసార్టులో కలిశామని... తమ మధ్య గొడవ జరగలేదని చెప్పింది.
 
హరీశ్ సోదరుడి సమక్షంలోనే తాము పెళ్లి గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ఎవరి జీవితం వాళ్లు గడిపేద్దామని కూడా చెప్పారని వెల్లడించింది. డబ్బు కోసం తాను బ్లాక్ మెయిల్ చేయలేదని తెలిపింది. హనుమకొండలో పెళ్లి చేసుకుందామని ఆయన చెప్పారని... ఆ తర్వాత వాహనం వద్దకు వెళ్లాలని తనకు చెప్పారని... అనంతరం గడియ పెట్టుకుని తుపాకీతో కాల్చుకున్నారని చెప్పింది. అయితే, ఆరోజు తనను మీడియాతో మాట్లాడకుండా పోలీసులు దూరంగా తీసుకెళ్లారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments