మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (16:20 IST)
వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే ఇంకొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మంలో వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ ఇల్లాలు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ స్వీటు షాపులో పనిచేస్తున్నాడు. ఇతడి భార్యకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వుంది. భర్త దుకాణానికి వెళ్లగానే అతడికి ఫోన్ చేసి ఏకాంతంగా గడపడం చేస్తున్నారు. ఐతే ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు శ్రీనివాసరావు. 
 
తమ ఏకాంతానికి భర్త అడ్డుగా వున్నాడనీ, అతడిని అడ్డు తొలగిస్తే హాయిగా ఎంజాయ్ చేయవచ్చని ప్రియుడితో చెప్పింది సదరు వివాహిత. ఆ ప్రకారం ప్రణాళిక వేసి ముగ్గురు వ్యక్తులకు లక్ష రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. దుండగులు ముగ్గురు ఈ నెల 6న ఇంటికి తిరిగి వస్తున్న శ్రీనివాసరావుపై దాడి చేసి చంపి పక్కనే కాల్వలోకి తోసేసారు. ఐతే కాలవ ఒడ్డున చెప్పులు, బట్టలు వుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఆ కాల్వలో శ్రీనివాసరావు మృతదేహం తేలడంతో పోలీసులు దాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈలోపుగానే దర్యాప్తు చేయగా వాస్తవం బయటపడింది. నిందతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments