Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (19:42 IST)
సమోసా విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆ షావు యజమాని హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాకేశ్ అనే వ్యక్తికి ఫరూక్ నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12వ తేదీన నిందితుడు పంకజ్ తన అనుచరులతో కలిసి టీ స్టాల్‌కు వచ్చి సమోసా ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై షాపు యజమానికి పంకజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన పంకజ్.. కొద్దిసేపటికి తన అనుచరులతో కలిసి షాపు వద్దకు చేరుకుని మళ్లీ యజమానితో ఘర్షణపడ్డాడు. 
 
ఈ క్రమంలో షాపు యజమానిపై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రాకేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఫరూఖ్ నగర్ - ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు. వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. మరోవైపు, పరారీలో ఉన్న నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామంటూ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments