Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన బంగారం - ఆల్‌టైమ్ గరిష్టం నుంచి క్షీణత

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (19:31 IST)
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారు ధరలు మరింత తగ్గుముఖం పట్టింది. ఆల్‌టైమ్ గరిష్టంగా పది శాతం ధర క్షీణించింది. భౌగోళిక ఉద్రిక్తల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇపుడిపుడే దిగొస్తోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1800 తగ్గుముఖం పట్టి, రూ.95,050 పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.94,600 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌‍లో దీని ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. 
 
దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.97 వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో రూ.98 వేలు ఉన్న వెండి ధర వెయ్యి రూపాయల మేరకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 16 డాలర్లు తగ్గుముఖం పట్టి 3160 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments