ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ సోమవారం విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో గగనతలంలో శత్రువును దెబ్బకొట్టామంటూ భారత సైన్యం ఆ వీడియోలో పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు అందులో పేర్కొంది. మిరాజ్ శకలాలు వీడియోలో కనిపించాయి.
పాకిస్థాన్ డ్రోన్ దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్యలను వెల్లడించింది. పాక్ స్థావరాలు, ఎయిర్‌క్రాఫ్టులను ధ్వంసం చేసిన తీరును ఆర్మీ ఆ వీడియోలో వివరించింది. ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మీడియాలో సమావేశం నిర్వహించి, దాయాదా ఆటలను ఆ విధంగా అడ్డుకున్నారో వివరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని వెల్లడించారు.