Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

Advertiesment
bank holiday

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (14:35 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఈ క్రమలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత హైఅలెర్ట్ ప్రకటించింది. సరిహద్దు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పోలీసు సిబ్బంది, పాలనా అధికారుల సెలవులను రద్దు  చేశారు. 
 
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్ పటిష్ఠమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్‌లో పంజాబ్ 532 కి.మీ, రాజస్థాన్ 1070 కి.మీ, గుజరాత్ 506 కి.మీ, బంగ్లాదేశ్‌తో పశ్చిమబెంగాల్ 2,217 కి.మీ. సరిహద్దును పంచుకుంటున్నాయి.
 
పరిపాలన కారణాల రీత్యా అన్ని విభాగాల పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత అధికారులను సంప్రదించి సెలవులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 'ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పుర్, పఠాన్కోర్, ఫాజిల్కా, అమృత్సర్, గుర్దాస్పుర్, తరతరణలో పాఠశాలలను మూసివేస్తున్నాం. అన్ని రకాల కార్యక్రమాలనూ రద్దు చేస్తున్నాం' అని పంజాబ్ రాష్ట్ర మంత్రి అమన్ అరోడా పేర్కొన్నారు. 
 
గురుదాసుర్లో 8 గంటలపాటు బ్లాక్ అవుటు నిర్వహించారు. రాజస్థాన్‌లోనూ నాలుగు సరిహద్దు జిల్లాలైన గంగానగర్, బీకానేర్, జైసల్మేర్, బాడ్మేడ్‌లో అన్ని బడులు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశించారు. ఈ నెల 9వ తేదీ వరకు జోధ్‌పూర్, బీకానేర్, కిషన్ ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం