Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

Advertiesment
murali naik

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (12:58 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పేరు మురళీ నాయక్. పాక్ సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా వాసి. 
 
వీర జవాన్ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అలాగే, వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. మురళీ నాయక్ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, మురళీ నాయక్ వీరమరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. 
 
దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ 
 
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అపరకుబేరులుగా గుర్తింపు పొందిన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్ యుద్ధం కారణంగా భారత్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
 
'ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది. మన మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వదానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము. ఇండియా ఫస్ట్. జై హింద్!' అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
 
'దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళల సిద్ధంగా ఉంటాం. ఆపరేషన్ సిందూర్ కోసం మన భారత సాయుధ దళాలను చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో భారత సాయుధ దళాలు సరిహద్దు అవతల నుంచి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు ఖచ్చితత్వంతో ప్రతిస్పందించాయి. ఉగ్రవాదం నేపథ్యంలో భారతదేశం ఎప్పుడూ మౌనంగా ఉండదని, మన గడ్డపై, మన పౌరులపై ఒక్క దాడిని కూడా మనం సహించబోమని మోడీ నాయకత్వం నిరూపించింది.
 
గత కొన్ని రోజులుగా మన శాంతికి ఎదురయ్యే ప్రతి ముప్పును దృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని చూపించాయి. రిలయన్స్ కుటుంబం మన దేశం యొక్క ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుంది. కానీ దాని గర్వం, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టదు. కలిసి, మనం నిలబడతాం. మనం పోరాడుతాం. మనం గెలుస్తాం. జై హింద్! జై హింద్ కీ సేనా!" అని ముఖేశ్ అంబానీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!