వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

ఐవీఆర్
శనివారం, 21 జూన్ 2025 (17:08 IST)
ఇటువంటివి రైలు ప్రయాణంలో కొన్నిసార్లు చూస్తుంటాం. కొన్నిరోజులు ముందుగానే ప్రయాణం సౌకర్యవంతంగా వుండాలని కొంమంది ప్రత్యేకించి విండో సీట్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ అదేమీ పట్టించుకోని ఇంకొందరు రిజర్వ్ చేసి వున్నా కూడా విండో సీటుని ఆక్రమించేసి, ఆ సీట్లో కూర్చోండి, వేరే బోగీలో వున్న మా కుటుంబ సభ్యుడి సీట్లో కూర్చోండి అని చెప్పేస్తారు. దానితో చాలామంది ఏంచేయాలో తోచక తమ సీటు తమకి ఇచ్చేయాలని గట్టిగా చెప్పేస్తుంటారు. దాంతో పరస్పర వాగ్వాదానికి దారి తీస్తుంది.
 
ఇట్లాంటి ఘటనే ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. ఓ వ్యక్తి తను కూర్చున్న విండో సీటు తమకు ఇవ్వలేదన్న కోపంతో ఎమ్మెల్యే మనుషులు అతడిని చితక్కొట్టినట్లు సమాచారం. దాంతో అతడికి రక్తం కూడా కారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు చూస్తే... ప్రయాణికులు చెప్పిన దాన్ని బట్టి ఓ ప్రధాన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు E-2 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే సీటేమో నెం.8, కానీ ఆయన భార్య, కుమారుడు సీట్లు 50, 51 వచ్చాయి. 49 విండో సీటు.
 
 
అతడిపై అలా దాడి చేసి తక్షణం 49 సీటును వదిలి మరోచోట కూర్చోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఐతే అక్కడే వున్న పోలీసులు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని తోటి ప్రయాణికులు ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే మాట్లాడుతూ... తన మనుషులు వచ్చి ప్రయాణికుడిపై దాడి చేసారనేది అవాస్తవం. మా మనుషులు ఎవరూ లేరు. నేను గొడవ జరుగుతుంటే దగ్గరికి వెళ్లి సర్ది చెప్పానంతే అంటూ వెల్లడించాడు. అతడి స్వభావం కాస్త తేడాగా వుందని ఎమ్మెల్యే సెలవిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments