Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం : కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (13:41 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోదారుణం జరిగింది. కదులుతున్న కారులో ఓ బాలిక అత్యాచారానికి గురైంద. దిండోరిలో ముర్సా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోదరితో కలిసి వెళుతున్న బాలికను నలుగురు యువకులు చెరబట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వస్తున్న ఆమె గ్రామానికి చెందిన నలుగురు యువకులు.. తమ కారు ఆపి వారికి లిఫ్ట్ ఇచ్చారు. బాలిక కూర్చొన్న వెంటనే మరో సోదరి కారు ఎక్కకుండానే కారను ముందుకు పోనిచ్చారు. అక్కడ నుంచి నేరుగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డారు. కారులోనే అత్యాచారం చేసే సమయంలో బాలిక అరుపులు వినిపించకుండా ఉండేందుకు వీలుగా కారులో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేశారు. 
 
ఆ తర్వాత తీసుకొచ్చి రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తనకు జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఈ నెల18వ తేదీన డిందోరి జిల్లా కేంద్రానికి వెళ్ళి ఉన్నత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులపై పోక్సో, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ మార్కం వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments