Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

ఐవీఆర్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (23:13 IST)
ఛత్తీస్‌గఢ్ లోని భిలాయ్‌లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. తను ఆత్మహత్య చేసుకునే ముందు తన మొబైల్ ఫోనులో సూసైడ్ నోట్‌తో పాటు పలు ఆధారాలను వదిలిపెట్టింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడైన ప్రియుడు, అతని స్నేహితులు పరారీలో వున్నారు. కాగా అత్యాచార బాధితురాలు తన ప్రాంతంలోనే వుంటున్న ఆది బార్లే అనే యువకుడితో గత జూన్ నెల నుంచి ప్రేమలో వుంది. తనను పెళ్లాడుతాననీ, జీవితాంతం సర్వస్వం చూసుకుంటానంటూ ఆమెకి వాగ్దానం చేసాడు.
 
ఇక అప్పట్నుంచి ఈ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆది తన కోర్కెను తీర్చుకునేందుకు బాధితురాలితో ఫోనులో సంభాషించడం, చాటింగ్ అంతా వుంది. ఈ క్రమంలో ఈనెల ప్రేమికుల రోజు అనంతరం 16వ తేదీ ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. చిట్టచివరికి ఆమె తన ఇంట్లో వంటరిగా వుందని తెలుసుకుని ఆమెను తన ఇంటికి రావాలంటూ పిలిచాడు. అప్పటికే తన ప్రియురాలు వస్తుందని తన స్నేహితులుకి సమాచారం ఇచ్చాడు. ఈమె వెళ్లేసరికి వారంతా అక్కడే వున్నారు. ఇంటికి వచ్చిన ఆమెపై అందరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన ఈ దారుణ ఘటనను తన సోదరునికి, తల్లికి చెప్పి బోరున విలిపించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యులు బైటకు వెళ్లగానే ఆత్మహత్య చేసుకున్నది.
 
ఐతే సూసైడ్ నోట్ లో ఆమె తన ప్రియుడు ఆది గురించి కొన్ని విషయాలను షేర్ చేసింది. ఆ సూసైడ్ నోట్లో.. " ఏమి చేసినా నా కోరిక ప్రకారమే జరిగింది. ఆది ఇష్టంతో పాటు నా ఇష్టం కూడా వుంది. జూన్ 2 నుంచి ఇద్దరం శారీరకంగా కలిశాము. ఐతే ఇది కొన్నిసార్లు అతడి బలవంతంతో మరికొన్నిసార్లు నా ఇష్టప్రకారం జరిగింది. ఆది తప్ప నాకు ఇంతకుముందు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదు'' అంటూ లేఖలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments