Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

ఐవీఆర్
శనివారం, 31 మే 2025 (19:00 IST)
ప్రేమ అనేది ఇదివరకు పెళ్లికాని ఇద్దరు యువతీయువకుల మధ్య తలెత్తి అది సన్నిహిత సంబంధం, పెళ్లికి దారి తీసేది. ఐతే ఇప్పుడు చాలాచోట్ల వెలుగుచూస్తున్న సంబంధాలు వివాహేతర సంబంధాలుగా వుంటున్నాయి. పెళ్లయిన పురుషుడు లేదా స్త్రీ పెళ్లికాని వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో నివాసం వుండే ఓ వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు.
 
ఐతే ఈమెకి ఫేస్ బుక్ ద్వారా స్వామి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. వీలున్నప్పుడల్లా అతడు వివాహితతో రాసలీలల్లో మునిగితేలడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసులు వారిద్దర్నీ పట్టుకుని బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి చేసారు. అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ బుద్ధి చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసారు.
 
భారతదేశంలో వివాహేతర సంబంధాలు, లేదా వ్యభిచారం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను సుప్రీంకోర్టు 2018లో కొట్టివేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga vamsi: లోక చాప్టర్ 1: షోలు రద్దు కావడం వల్ల నిర్మాత నాగ వంశీకి లాభమా నష్టమా?

నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్‌గా ఉంటారు : కమిలినీ ముఖర్జీ

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments