Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిని బండరాళ్లతో కొట్టి హతం

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:51 IST)
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం ఇందారంలో అందరూ చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం. మహేష్ (24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గత ఏడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు.
 
దీంతో యువతిపై క్షక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలను సోషల్ మీడియా పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం ఉదయం మహేష్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments