Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!

ఠాగూర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారిని ఓ కామాంధుడు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పైగా, ఆ బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లుపడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని కమలా రాజా ఆస్పత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. 
 
శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. నిద్ర కూడా పోవడం లేదు. ప్రైవేట్ భాగాలు, ముఖం, దవడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి పడకపై పక్కకు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. అంతగా ఆమె శరీరం గాయాలపాలైంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 17 యేళ్ల నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ దారుణ ఘటన ఈ నెల 22వ తేదీ రాత్రి జరిగింది. పొరుగునవున్న ఝాన్సీ జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఆ బాలిక తాత, నానమ్మ ఆస్పత్రికి వెళ్లారు. దీన్ని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని కుర్రోడు ఈ పాడుపడినికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడుని బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ మోసం: తమన్నా, కాజల్ అగర్వాల్‌లను పోలీసులు ప్రశ్నించాలి?

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం