Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరెక్కాల్సిన బస్సు ఇది కాదు అది అంటూ ఏసీ బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం

Advertiesment
crime

ఐవీఆర్

, గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:22 IST)
మీరు ఎక్కవలసిన బస్సు ఇది కాదు అది అంటూ ఓ మహిళను తప్పుదారి పట్టించి, బస్సు కిటికీ అద్దాలు పూర్తిగా మూసి వుంచి వుండే ఏసీ బస్సులోకి ఎక్కించాడు ఓ కామాంధుడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణెలో ఫిబ్రవరి 25న స్వర్గేట్ డిపోలో ఆగి ఉన్న మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) బస్సులో ఒక మహిళపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు దత్తాత్రయ రామ్‌దాస్ గాడే (37) గురించి సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డును పూణే నగర పోలీసులు ప్రకటించారు.
 
కాగా అతనిపై గతంలో పూణే రూరల్ పోలీసులు దోపిడీ, దొంగతనం కేసుల్లో అభియోగాలు వున్నాయి. అతడి గురించి ఆచూకి చెప్పిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. 48 గంటలకు పైగా పరారీలో ఉన్న గాడే కోసం నగర పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో సతారా జిల్లాలోని తన స్వస్థలానికి బస్సు ఎక్కేందుకు స్వర్గేట్ బస్ డిపోలో వేచి ఉన్న 26 ఏళ్ల బాధితురాలిని నిందితుడు తప్పుదారి పట్టించాడు.
 
మీరెక్కాల్సిన బస్సు ఇది కాదు అది అంటూ ఏసీ బస్సులోకి తీసుకెళ్లి, ఖాళీగా ఉన్న శివషాహి బస్సు, సెమీ లగ్జరీ MSRTC బస్సులోకి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బస్సు ఎయిర్ కండిషన్ కావడంతో దాని కిటికీలు పూర్తిగా మూసి వుండటంతో లోపల ఏం జరుగుతున్నదన్నది బైటకు తెలియలేదని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?