Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం సాధ్యం కాదు, చనిపోదాం రా: ప్రేయసికి విషమిచ్చి ప్రియుడు పరార్

ఐవీఆర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:17 IST)
పొన్నూరు మండలం పరిధిలో వున్న మన్నవ గ్రామంలో ప్రేమికుల రోజున దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రేయసీప్రియుల్లో ప్రేయసి ప్రాణాలు పోగొట్టుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
 
మన్నవ గ్రామంలో వంశీ అనే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న యువకుడు తన సమీప బంధువు అయిన వివాహిత సునీతను ప్రేమిస్తున్నాడు. ఆమెతో క్రమంగా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సునీత తనను ప్రేమిస్తున్న వంశీతో కలిసి సహజీవనం చేసేందుకు నిర్ణయం తీసుకుని అతడితో సన్నిహితంగా వుంటూ వస్తుంది. ఇది గమనించిన పెద్దలు ఇద్దర్నీ హెచ్చరించారు. ఎవరికివారు దూరంగా వుండాలని గట్టిగా చెప్పేసారు. దీనితో వంశీ ప్రేమికుల రోజు నాడు సునీతకు ఫోన్ చేసాడు. 
 
మన ప్రేమకి పెద్దలు అడ్డంకిగా మారారనీ, కలిసి జీవించే అవకాశం లేకుండా చేస్తున్నారు కనుక కనీసం కలిసి చనిపోదాం అంటూ ఆమెకి ప్రపోజ్ చేసాడు. దాంతో సునీత వెంటనే వంశీ రమ్మని చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అప్పటికే విషం డబ్బా తెచ్చాడు వంశీ. అతడామెకి ఆ పాయిజన్ డబ్బా ఇవ్వడంతో వెంటనే దాన్ని తాగేసింది. కానీ వంశీ మాత్రం తనకు భయంగా వుందంటూ డబ్బాను అక్కడే పడేసి పారిపోయాడు. సునీత నురగలు కక్కుతూ పడిపోవడంతో గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
 
సునీతను అడ్డు తొలగించుకునేందుకే వంశీ ప్రణాళిక ప్రకారం ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాడని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. మరిన్ని విషయాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments