Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు లూజ్ మోషన్స్... పైగా కొత్త జబ్బు వచ్చింది... : నారా లోకేశ్ సెటైర్లు

nara lokesh

ఠాగూర్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (09:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లూజ్ మోషన్స్ పట్టుకున్నాయని, పైగా, కొత్త జట్టు ఒకటి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బొబ్బిలిలో జరిగిన శంఖారావం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర - పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర - పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి అంటూ తన ప్రసంగాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఇంతటి పవిత్ర భూమిపై, చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడటం నా అదృష్టం అని నారా లోకేశ్ తెలిపారు.
 
తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుండి పారిపోతుందని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఒక కొత్త జబ్బు వచ్చింది. అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య బయటకు వచ్చాడా? జగన్‌కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. తాడేపల్లి మున్సిపల్ అధికారులను అడిగా... ఎందుకు జగన్ బయటకు రావడం లేదు అని. ఈ ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని వారు చెబుతున్నారు.
 
ఈ ప్రభుత్వానిది చెత్త పాలన. గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు. వందలమంది ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీని అడుగుతున్నా... అమ్మా రజనీ... నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావ్... మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారారమ్మా? సీఎం జగన్ ఇప్పుడు పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారు. అందుకే సినిమాల పిచ్చి ఎక్కువైంది. యాత్ర-2 అని సినిమా తీశారు. 
 
ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాం. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్-6 ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేలు భృతి ఇస్తాం. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తాం. 18-59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తాం అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు