Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి వచ్చిన స్నేహితురాలు.. గంజాయి మత్తులో భర్త అత్యాచారం.. సహకరించిన భార్య!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (09:21 IST)
తనను నమ్మి ఇంటికి వచ్చిన స్నేహితురాలికి బలవంతంగా గంజాయిని ఓ మహిళ అలవాటు చేసింది. ఆ తర్వాత తన స్నేహితురాలి, తన భర్తతో కలిసి ఆ మహిళ కూడా గంజాయి సేవించసాగింది. ఈ క్రమంలో ఓ రోజున ఇంటికి వచ్చిన స్నేహితురాలిపై కట్టుకున్న భర్త లైంగికదాడికి దెగబడ్డాడు. దీన్ని అడ్డుకోవాల్సిన భార్య... అత్యాచారం చేస్తున్న భర్తకు సహకరించింది. ఆపై ఫోటోలు, వీడియోతలు తీసింది. వీటిని అడ్డుపెట్టుకుని తన స్నేహితురాలిని బ్లాక్‌మెయిల్ చేయసాగింది. బాధితురాలు, నిందితులు ఇద్దరూ కూడా న్యాయవిద్య అభ్యసిస్తుండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల క్రితం తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ కోర్సులో చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పుదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35)తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లసాగింది. 
 
ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిశోర్‌తోనూ బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, గంజాయికి బానిసలైన ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిశోర్ ఇద్దరూ తమ ఇంటికి వచ్చే యువతికి కూడా దానిని అలవాటు చేశారు. ఆమె ఆ మత్తులో ఉండగా కృష్ణ కిశోర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోనులో వీడియో తీసింది. వాటితో బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ బంగారం నగలు లాక్కున్నారు. అక్కడితో ఆగక ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడు, ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న యూనివర్శిటీ అధికారులు.. ఆ దంపతులిద్దరీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments