Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

ఐవీఆర్
శనివారం, 16 ఆగస్టు 2025 (12:49 IST)
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాల కేసులు క్రమంగా ఎక్కువవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ లేడీ పోలీస్ తన ప్రియుడుతో కలిసి ఏకాంతంగా వుండగా ఆమె భర్త వారిద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసాడు. ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసాడు.
 
పోలీసులకు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆనంద్ అనే వ్యక్తి తన భార్యను ఎంతో కష్టపడి చదివించాడు. ఆ తర్వాత ఆమెకి పోలీసు శాఖ నిర్వహించిన పరీక్షల్లో పోలీసు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు భార్య ప్రవర్తనలో మార్పు రావడం గమనించాడు. పొద్దస్తమానం ఎవరితోనో ఫోనులో మాట్లాడటం, తన పట్ల అశ్రద్ధగా వుండటంతో ఆమెపై నిఘా పెట్టాడు. దీనితో ఆమె మరొకరితో వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు తెలుసుకున్నాడు.
 
ఐతే అసలే ఆమె పోలీసు కావడంతో తేడా వస్తే తననే జైలు లోపల వేసి కుళ్లబొడుస్తుందని గ్రహించిన అతడు అదను కోసం వేచి చూస్తూ వచ్చాడు. అతడు ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చింది. తన పోలీసు భార్య ఆమె ప్రియుడుతో కలిసి ఓ లాడ్జి గదిలో ఏకాంతంగా గడిపేందుకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. వెంటనే తన తోటి స్నేహితులను వెంటబెట్టుకుని హోటల్ గదికి వచ్చాడు. అక్కడ ఆ గది తలుపులు కొట్టడంతో ఆమె బయటకు వచ్చింది. ఎదురుగా భర్తను చూసి షాక్ తిన్నది. లోపల వున్నది ఎవరూ అంటూ భర్త స్నేహితులు లోనికి వెళ్లి మంచం కింద ఫోన్ కెమేరా ఆన్ చేసి పెట్టారు. మంచం కింద దాక్కున్న ప్రియుడు లోదుస్తులు సరి చేసుకుంటూ ఎంతమాత్రం భయం లేకుండా బైటకు వచ్చాడు. వాళ్లిద్దర్నీ తీసుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు సదరు లేడీ పోలీసు భర్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments