దిల్ రాజు అల్లుడి కారు తీసుకెళ్లమని కేటీఆర్ చెప్పారు: ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నా, ఎవరు?

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (12:10 IST)
కోటిన్నర విలువ చేసే ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి పోర్షే కారు అపహరణకు గురైంది. దీనితో దిల్ రాజు అల్లుడు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు చూస్తే... శుక్రవారం నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడు అర్చిత్ జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటలుకి కారులో వచ్చారు. ఆ తర్వాత 45 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూస్తే కారు కనిపించకపోయేసరికి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్ సిబ్బంది వద్ద ఆరా తీసారు. సీసీ కెమేరాలను పరిశీలించారు. సిటీలోని చెక్ పోస్టులకు సమాచారం అందించారు. ఐతే జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద దిల్ రాజు అల్లుడి కారును నడుపుతూ ఓ వ్యక్తి సిగ్నల్ జంప్ చేసి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడంతో కేబీఆర్ పార్క్ వద్ద కారును ఆపి అందులో వున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కారును ఎందుకు తీసావు అని ప్రశ్నించిన పోలీసులకు దిమ్మతిరిగే సమాధానాలు వచ్చాయి. తను ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ అసిస్టెంటుననీ, ఈ కారును మంత్రి కేటీఆర్ తీసుకెళ్లమని సూచిస్తే తీసుకెళ్తున్నాననీ, తను తన సహాయకుడు హృతిక్ రోషన్‌తో కలిసి వెళ్లాల్సి వుందని చెప్పుకొచ్చాడు. వదిలితే వెంటనే వెళ్లిపోవాలంటూ వారిని తొందరపెట్టడం చూసి పోలీసులు షాక్ తిన్నారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ చేయగా సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదనీ, గతంలో ఆసుపత్రిలో సైతం చికిత్స పొందినట్లు చెప్పారు. నిందితుడి పేరు మల్లెల సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments