Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మించి గుడికి తీసుకెళ్లి భార్యను హత్య చేసిన భర్త... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (12:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను నమ్మించి గుడికి తీసుకెళ్లిన భర్త.. కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యతో ప్రేమగా నటిస్తూ బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి కిందకు తోసేశాడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ దారుణం జరిగింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెనుగంచిప్రోలు తుఫాను కాలనీకి చెందిన పద్మాల సురేష్, త్రివేణి (32)లకు పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల లోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాపీ పని, భార్య వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో కొంతకాలంగా త్రివేణి స్వగ్రామమైన వత్సవాయి మండలం శింగవరంలో వేరే కాపురం పెట్టారు. గొడవలు సర్దుకోవడంతో సామాగ్రి సర్దుకుని నాలుగైదు రోజుల క్రితమే పెనుగంచిప్రోలుకు వచ్చారు. 
 
నాలుగు రోజులుగా భార్యతో ప్రేమగా వ్యవహరించి నమ్మించాడు. శనివారం ఉదయం కొనగిరి మల్లికార్జునకొండపై దేవుని దర్శనానికని చెప్పి ద్విచక్రం వాహనంపై భార్యను తీసుకెళ్లాడు. సాయంత్రంమైనా తల్లిదండ్రులు తిరిగి రాకపోవడంతో పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న తాతకు చెప్పారు. అనుమానం వచ్చిన ఆయన త్రివేణి కుటుంబ సభ్యులు అదే రోజున పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ రాంబాబు ఆదివారం ఆదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
సురేష్ నవాబుపేటలో ఉన్నట్టు తెలుసుకున్నట్టు పోలీసులు సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని విచారించగా బలమైన రాయితో తలపై కొట్టి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కొండకు వెళ్లే ఘాట్‌రోడ్డుపై నుంచి పక్కనున్న లోయలోకి తోసేసినట్టు చెప్పాడు. కొనగిరి మల్లికార్జున కొండపై త్రివేణి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 20 అడుగులు లోతైన లోయలో ఉన్న మృతదేహాన్ని తాళ్ల సాయంతో బయటకు తీశారు. జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments