గుంటూరు జిల్లా చిన్నారి మృత్యువాత.... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:12 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. పెంట్‌హౌస్ స్లాబ్ విరిగిపడిన ఘటనలో నాలుగేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని షారూన్ దీత్య (4)గా గుర్తించారు. కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్ శాతవాహన నగరవాసి. మృతురాలి తల్లిదండ్రులు సునీల్ కుమార్. లూత్ మేరీ. స్వస్థలం గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామవాసులు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరానికి వలస వెళ్లి బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు మేరీ తన కుమార్తెతో కలిసి పక్కనే ఉన్న టిఫిన్ సెంటరుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా బేకరీ పక్కనే ఉన్న భవనంపై నిర్మాణంలో ఉన్న పెంట్‌హౌస్‌కు సెంట్రింగ్ కర్రలు తొలగిస్తుండా స్లాబ్ విరిగి తల్లీ బిడ్డపై పడ్డాయి. 
 
ఈ ఘటనపై చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మేరీ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు  చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja : రవితేజ, ‎ఆషికా రంగనాథ్ ల స్పెయిన్ సాంగ్ బెల్లాబెల్లా రాబోతుంది

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments