Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత పరీక్ష లేకుండానే ఈసీఐఎల్‌లో ఉద్యోగాల భర్తీ

Advertiesment
ECIL
హైదరాదాబ్ ప్రధాన కేంద్రంగా ఉ్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రకటన ఆధారంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభంకాగా ఈ పోస్టులను రాత పరీక్ష లేకుండానే భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి రూ.20,480 నుంచి రూ.24,780 వరకు నెలవారీ వేతనం ఇవ్వనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 30 యేళ్లకు మించరాదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? బండి సంజయ్