ఖమ్మంలో దారుణం : 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా టీచర్ లైంగిక దాడి - తెలియగానే సూసైడ్

ఠాగూర్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 14 యేళ్ల విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు మూడేళ్ళుగా లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు తనపై జరుగుతున్న దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచరుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే ఆ టీచర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కొణిజర్ల మండల పరిధిలో సోమవారం జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు, మధిర మండలం ఆత్కూరు గ్రామాని చెందిన అరిగెల ప్రభాకర్ రావు (46) కొణిజర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో బాలుడు భయపడి మౌనంగా ఉండిపోయాడు. 
 
ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు, తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రుల ఎంత అడిగినా కారణం చెప్పలేదు. చివరకు గట్టిగా నిలదీయడంతో ఉపాధ్యాయుడు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును వవరించాడు. దీంతో బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రభాకర్ రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ విషయం తెలియగానే పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రావును మందలించారని, దీంతో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు సమాచారం. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న ప్రభాకర్ రావు తీవ్ర మనస్తాపంతో ఆదివారం రాత్రి తన స్వగ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగుల మందు సేవించాడు. 
 
అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మధిరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్ పొందుతూ సోమవారం ప్రభాకర్ రావు మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం