Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను చంపేసిన కోడలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (20:15 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండటంతో అత్తను కోడలు చంపేసింది. ఆమె ప్రియుడు కూడా ఈ హత్యకు తన వంతు సహకారం అందించారు. ఇది కర్నాటకలోని బెంగుళూరు నగరానికి సమీపంలోని బద్దరహళ్లి అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ బద్దరహళ్లి ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి భార్య రష్మీ, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన మంజునాథ్ తల్లి ఆకస్మికంగా మృతి చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయివుంటారని అందరూ భావించారు. కానీ, తన తల్లి మృతిపై మంజునాథ్‌కు ఎక్కడో సందేహం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
మంజునాథ్ ఇంటిపై అద్దెకు ఉండే అక్షయ్ అనే యువకుడితో రష్మీకి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్షయ్‌కు అవసరమైనపుడల్లా రష్మీ డబ్బులు ఇస్తూ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ విషయం మంజునాథ్ తల్లికి తెలియడంతో ఆమె కోడలు రష్మిని హెచ్చరించింది. ప్రవర్తన మార్చుకోకపోతే తన కుమారుడికి చెబుతునని బెదిరించింది. దీంతో తన ప్రియుడు అక్షయ్‌తో కలిసి అత్తను చంపేందుకు ప్లాన్ వేశాం. ఆహారంలో అధిక మోతాదులో నిద్రమాత్రుల కలిపి, గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో రక్ష్మీతో పాటు.. అక్షయ్ వెల్లడించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments