Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (16:08 IST)
తమ ప్రేమకు, పెళ్లికి అడ్డొస్తుందన్న అక్కసుతో ప్రియురాలి తల్లిపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దాడి చేసి, గొంతు పిసికి చంపడానికి నిరాకరించాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో జరిగింది. ప్రియురాలి తల్లిపై దాడి చేసి, గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. 
 
సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్‌కుమార్ అనే యువకుడు జాడి సుస్మిత అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలోవున్నాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి చామంతి కుమార్తెను పలుమార్లు మందలించింది. పైగా, పక్షవాతంతో మంచంలో ఉన్న తండ్రి పరిస్థితిని వివరించి సుస్మిత మనసు మార్చింది. దీన్ని రాజ్ కుమార్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
తమ ప్రేమకు చామంతి అడ్డొస్తుండటంతో ఆమెను ఎలాగైనా చంపాలని కుట్ర పన్నాడు. ప్రియురాలి తల్లిపై తీవ్రమైన కసితో దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె కిందపడిపోవడంతో ఆమెపై కూర్చొని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. దీన్ని చూసిన కుమార్తె సుకన్యతో పాటు స్థానికులు రాజ్‌కుమార్‌ను అడ్డుకుని చామంతిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments