Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి - పోలీసుల అదుపులో నిందితుడు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:56 IST)
కడప జిల్లా బద్వేల్ సమీపంలో పెట్రోల్ దాడికిగురైన ఇంటర్ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. శనివారం విద్యార్థిని పై ప్రేమోన్మాది విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరడం వల్లే దాడి చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. కడప రిమ్స్ బాధితురాలి నుంచి జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్ నిప్పంటించినట్లు బాలిక తెలిపింది.
 
స్నేహితుడి ముసుగులో విఘ్నేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కలవడానికి రమ్మని చెప్పి... పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన మేరకు.. బాధిత బాలిక (16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. 
 
ఇద్దరూ బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపీకుంట చెక్ పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేష్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అమ్మాయిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్క తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments