Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఇండియన్ కుర్రాడు, సెక్స్‌ కోసం వెళితే 10 ఏళ్ల శిక్ష పడింది

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:49 IST)
అమెరికా... అనగానే డాలర్ల వర్షం, సంపాదనకు నెలవు అనేది చాలామంది అభిప్రాయం. అందుకే అక్కడికి వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకుని ఇండియా తిరిగి వచ్చి ఓ ఇల్లు గట్రా అన్నీ కొనుక్కుని కాలు మీద కాలేసుకుని సెటిలైపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం అక్కడికి వెళ్లిన పనిని మర్చిపోయి పెడదారిలో పడిపోతారు. ఇలాంటిదే జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని ఒమాహాలో నివశిస్తున్నాడు సెల్వరాజ్. అక్కడ ఉద్యోగం చేసేందుకు వెళ్లిన ఇతగాడు సెక్స్ కోసం వెంపర్లాడాడు. ఈ క్రమంలో 2020 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 4 మధ్య మైనర్ బాలికలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆన్లైన్లో ఓ సైట్‌ను ఫాలో అయ్యాడు. అందులో వున్న నెంబరుకి మెసేజ్ చేసాడు. ఐతే ఆ నెంబరు పెట్టింది పోలీసులే కావడంతో ఇరుక్కున్నాడు. కానీ వారు మాత్రం 15 ఏళ్ల బాలికలా సమాధానం ఇచ్చారు.
 
ఇద్దరు బాలికలు కావాలనీ, రూ. 12 వేలు చెల్లిస్తాననీ, తనకు ఓరల్ సెక్స్ కావాలని బేరం కుదుర్చుకున్నాడు. ఈ హోటల్ అడ్రెస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు. ఆ హోటల్ దగ్గరికి వెళ్లగానే ఎదురుగా పోలీసులు నిలబడి వున్నారు. నేరుగా వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఐదేళ్ల పాటు పోలీసుల పర్యవేక్షణలో వుండాలని ఆదేశించింది. ఆ తర్వాత దేశ బహిష్కరణ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం