Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితోపులో ప్రియుడితో భార్య, భర్త రాగానే చెట్టుకు కట్టేసి చితకబాదారు...

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (22:31 IST)
ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త రైతు. ఆర్థికంగా బాగానే స్థిరపడ్డ కుటుంబం. ఉదయం వెళ్ళే భర్త పొలంలో పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. ఇక పిల్లలు ఉదయాన్నే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. తాను ఒంటరిగా ఫీలయ్యింది మహిళ. చేతిలో ఫోన్ కూడా లేదు. టైం పాస్ కోసం ఇంటి పక్కనే యువకుడితో మాట్లాడుతుండేది. ఆ యువకుడు కాస్తా ఆమెను పక్కదారి పట్టించి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతడితోనే జీవితం అనుకుని అతడితో కలసి పారిపోయింది.

 
చిత్తూరుజిల్లా బంగారుపాళ్యెం మండలం వంకరవారిపల్లికి చెందిన గణేష్, నందినిలకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గణేష్‌ను నందిని ఎన్నో నెలలుగా ఫోన్ కొనివ్వమని అడుగుతోంది. అయితే పల్లెటూరు కావడంతో ఫోన్‌తో పనిలేదని చెబుతూ ఉండేవాడు భర్త.

 
ఇంట్లో పిల్లలు లేకపోవడం.. భర్త కూడా పొలానికి వెళ్ళిపోతుండటంతో ఇంట్లో ఒంటరిగా ఉండేది నందిని. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న రెడ్డెప్ప పరిచమయ్యాడు. యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాడు. దీంతో అతనితో మూడు నెలల నుంచి అక్రమ సంబంధం పెట్టుకుంది నందిని. భర్తకు తెలిసి మందలించాడు. అయినా వినిపించుకోలేదు. నిన్న మధ్యాహ్నమే సడెన్‌గా ఇంటికి వచ్చాడు గణేష్. ఇంట్లో భార్య లేదు. దీంతో భార్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. తన ఇంటికి సమీపంలోని మామిడితోపులో ప్రియుడితో ఎంజాయ్  చేస్తూ కనిపించింది భార్య.

 
ఏకాంతంగా ఇద్దరూ ఉన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గణేష్ రెడ్డెప్పపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న రెడ్డెప్ప, నందినిలు గణేష్‌ను మామిడి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తీవ్రగాయాలపాలైన గణేష్ స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. గ్రామస్తులు గుర్తించి గణేష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తే అసలు విషయం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments