పెళ్ళికి ముందే ఒక యువతిని ప్రేమించాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్ళికి అంగీకించలేదు. తమ బంధువుల అమ్మాయినే ఇచ్చి అతనికి వివాహం చేశారు. పెళ్ళయి ఏడు నెలలలైంది. అయితే భార్యతో సంసారం చేయలేకపోయాడు. ప్రియురాలు తప్ప వేరే యువతిని ఆ స్థానంలో ఊహించుకోలేకపోయాడు. ఆమెతో కలిసి పారిపోయాడు.
భీమలపల్లి గ్రామానికి చెందిన మహేష్, సుమలతకు ఏడు నెలల క్రితం వివాహమైంది. పెళ్ళయినప్పటి నుంచి భార్యతో కాపురం చేయలేదు మహేష్. తాను పెళ్ళికి ముందే ఒక యువతిని ప్రేమించినట్లు భార్యకే చెప్పాడు. భర్త వేరే యువతిని ప్రేమించాడన్న విషయం తెలిసినా మౌనంగా ఉండిపోయింది ఆ వివాహిత.
అయితే నెలరోజుల క్రితం అసలు విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో సుమలత కుటుంబ సభ్యులు మహేష్‌ను నిలదీశారు. వారిని పెద్దగా పట్టించుకోలేదు మహేష్. బుధవారం ఉదయం ప్రియురాలిని వెంట పెట్టుకుని ఇంటి నుంచి పారిపోయాడు. భార్యకు మాత్రం ఉద్యోగానికి వెళ్ళి వస్తానని చెప్పాడు.
అయితే మహేష్ మధ్యాహ్నం ఇంటికి రాకపోవడంతో పాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం.. మహేష్ ప్రేమించిన యువతి ఇంటిలో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. బాధిత మహిళ సుమలతకు న్యాయం చేయాలంటూ అత్త ఇంటి ముందు ధర్నాకు దిగారు.