Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో భార్యను హత్య చేసి హైదరాబాద్ నగరానికి వచ్చేసిన భర్త!

ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (15:03 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో హత్యకుగురైంది. ఆమె మృతదేహం ఊరి చివరన ఉన్న డస్ట్ బిన్‌లో గుర్తించారు. మృతురాలిని చైతన్య మాధగానిగా గుర్తించారు. ఈ దారుణం విక్టోరియాలోని బక్లీలో వెలుగు చూసింది. చైతన్య హత్య గురైన విషయాన్ని ఆమె భర్తకు చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆమె భర్త అప్పటికే ఆస్ట్రేలియాను విడిచి భారత్‌కు వచ్చేసినట్టు తేలింది. దీంతో భార్యను భర్తే హత్య చేసి భారత్‌కు పారిపోయివుంటాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 
 
విక్టోరియా పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. బక్లీ శివార్లలోని చెట్ల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ డస్ట్ బిన్ గురించి స్థానికులు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డస్ట్ బిన్‌ను ఓపెన్ చేసి చూడగా లోపల ఓ మహిళ మృతదేహం కనిపించింది.  ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో ఆ మహిళ చనిపోయినట్టుగా గుర్తించారు. ఇదే హత్యేనని, హంతకుడు ఆమెను వేరే చోట చంపి... మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. చైతన్య భర్త అశోక్ రాజ్‌కు సమాచారం అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. 
 
మిర్కావేలోని పాయింట్‌కు కుక్‌‍లో అశోక్, చైతన్య నివసించే ఇంటికి వెళ్లగా ఫ్లాట్‌కు తాళం వేసి ఉందని, అశోక్ ఇటీవలే ఇండియాకు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో చైతన్య హత్యలో అశోక్‌ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఇతరాత్రా కోణాల్లో పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments