Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. భయపెట్టి.. బెదిరించి.. అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (17:42 IST)
ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, భయపెట్టి, బెదిరించిన కొందరు కామాంధులు ఈ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు బాలికలకు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చాయి. బాలికలు అంగీకారం తెలపడంతో వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహం పేరుతో బాలికలను నమ్మించి వీడియో చాటింగ్ చేసి.. వారికి తెలియకుండా రికార్డు చేశారు. ఆ వీడియోలను నగ్నంగా ఉన్నట్టు మార్చి.. వాటిని బాలికలకు పంపించి బెదిరించారు. 
 
బహిర్గతం చేస్తామని హెచ్చరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఓ బాలిక పరీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండటాన్ని ఆమె తల్లి గమనించి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మరో బాలిక నుంచి కూడా ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి రూ.30 వేల విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments