Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హుస్సేన్ సాగర్ చుట్టూ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ఉచిత సేవలు

Advertiesment
double decker
, శనివారం, 11 నవంబరు 2023 (19:11 IST)
ప్రయాణీకులు, పర్యాటకులకు హెచ్‌ఎండీఏ శుభవార్త చెప్పింది. హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల డబుల్‌ డెక్కర్‌ బస్సుల సేవలు అందుబాటులోకి రాగా.. ఈ సర్వీసులను ఉచితంగా అందిస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. 
 
గత కొన్ని రోజులుగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. అయితే, వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు, పర్యాటకులు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా రేస్‌లో హెచ్‌ఎండీఏ ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులను కొనుగోలు చేసింది. 
 
ఒక్కో బస్సుకు రూ.2.5 కోట్లు వెచ్చించి మూడు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసినా చాలా కాలంగా ఈ బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఈ బస్సులు హుస్సేన్ సాగర్, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం చుట్టూ తిరుగుతున్నాయి. 
 
స్మారకం స్థాపన తర్వాత, నెక్లెస్ రోడ్ వైపు సందర్శకుల రద్దీ గణనీయంగా పెరిగింది, ఈ పరిసర ప్రాంతాలను సందర్శించడానికి హైదరాబాద్ వాసులనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 
అన్ని పర్యాటక కేంద్రాలు కవర్ అయ్యేలా హుస్సేన్ సాగర్ తిప్పనున్నారు.
 
ప్రస్తుతం సాగర్ చుట్టూ మూడు బస్సులు తిరుగుతున్నాయి. సంజీవయ్య పార్క్, థ్రిల్ సిటీ, లేక్ ఫ్రంట్ వ్యూ, జలవీహార్ పార్క్, నీరా కేఫ్, పీపుల్స్ ప్లాజా, ఇందిరాగాంధీ, పీవీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత సచివాలయానికి వెళ్లవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం.. టాయిలెట్‌కు వెళ్లిన..?